తగ్గేదేలే.. ప్లేఆఫ్స్‌లో మరింత అగ్రెసివ్‌గా ఆడతాం: ప్యాట్ కమిన్స్
- ఈరోజు రాజస్థాన్‌తో ఎలిమినేటర్ పోరు
- టైటిల్ కోసం వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవడమే లక్ష్యం
- లీగ్ దశలో ఆర్ఆర్పై రెండు విజయాల ఆత్మవిశ్వాసం
- విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక ప్లాన్స్
- మ్యాచ్‌లో తప్పులు సరిదిద్దుకుని బరిలోకి దిగుతున్నట్లు వెల్లడి
పీఎల్ 2026 ప్లేఆఫ్స్ సమరం మొదలైన వేళ సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నాకౌట్ మ్యాచ్‌ల ఒత్తిడిని జయించాలంటే డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లడం కంటే మరింత దూకుడుగా ఆడటమే తమ వ్యూహమని స్పష్టం చేశారు. ఈరోజు చండీగఢ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఆయన తన మనసులోని మాటలను పంచుకున్నారు.
ప్లేఆఫ్స్ ఒత్తిడిపై
నరాలు తెగే ఉత్కంఠ రేపే నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడి సహజమని కమిన్స్ అభిప్రాయపడ్డారు. టోర్నీలో ఇప్పటివరకు జట్టును విజయతీరాలకు చేర్చిన సహజ శైలిని మార్చుకోవద్దని ఆటగాళ్లకు సూచించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా వంద శాతం శ్రమించాలనే మైండ్‌సెట్‌తోనే తాము బరిలోకి దిగుతున్నట్లు చెప్పారు. ట్రోఫీ గెలవాలంటే వరుసగా మూడు మ్యాచ్‌లు నెగ్గాలని, లీగ్ దశలో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన తమకు ఇది అసాధ్యమేమీ కాదని ధీమా వ్యక్తం చేశారు.
సూర్యవంశీ కోసం ప్రత్యేక వ్యూహాలు
ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున పరుగుల వరద పారిస్తున్న 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీపై కమిన్స్ ప్రత్యేకంగా స్పందించారు. ఈ టోర్నీలో 583 పరుగులతో దూసుకుపోతున్న వైభవ్‌ను కట్టడి చేసేందుకు తమ వద్ద ప్లాన్-బి, ప్లాన్-సి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. గత మ్యాచ్‌లో వైభవ్ తమపై సెంచరీ బాదినప్పటికీ కొన్ని ఓవర్లలో అతడిని బాగానే కట్టడి చేశామని గుర్తుచేశారు. ఆ తప్పుల నుంచి నేర్చుకుని ఈసారి పక్కా వ్యూహంతో బౌలింగ్ చేస్తామని తెలిపారు.
లీగ్ విజయాలు గతం
లీగ్ దశలో రాజస్థాన్‌పై సాధించిన రెండు విజయాలు ప్రస్తుత నాకౌట్ మ్యాచ్‌కు వర్తించవని ఎస్ఆర్హెచ్ కెప్టెన్ స్పష్టం చేశారు. ప్లేఆఫ్స్‌లో మళ్లీ సున్నా నుంచే ఆటను ప్రారంభించాల్సి ఉంటుందని చెప్పారు. అయితే గత మ్యాచ్‌ల్లో వారి ఆటగాళ్లపై సాధించిన సక్సెస్ తమ జట్టు సభ్యులకు మానసికంగా మంచి బూస్టింగ్ ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యర్థి బలాలు, బలహీనతలపై పూర్తి అవగాహన ఉందని, కచ్చితంగా మ్యాచ్ గెలిచి క్వాలిఫైయర్-2 కు దూసుకెళ్తామని కమిన్స్ ఆశాభావం వ్యక్తం చేశారు.